పట్ట భద్రులకు ఉచిత శిక్షణ హైదరాబాద్ : అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్ పై నిరుద్యోగ వ్యవసాయ పట్టభద్రులకు రెండు నెలలు ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ సెంటర్ ఫర్ సెంటర్ ప్రిన్యూర్ షిప్ డెవలప్ మెంట్ (సి.ఇ.డి) తెలిపింది. ఆధునిక, సాంకేతిక వ్యవసాయ పద్ధతుల వివరాలు, పంటల పెంపకాలు, వ్యవసాయ అభివృద్ధి, సాఫ్ట్వేర్ రంగం తోడ్పాటు, పంటల భీమా, వివిధ వ్యవసాయ ఉత్పత్తులతో పరిశ్రమల నిర్వహణ, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ విధానాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు, వ్యారంలో మెళకువలు, ప్రాజెక్ట్ తయారీలో తోడ్పాటు మొదలగు అంశాలపై శిక్షణ ఇస్తారు. ఆయా రంగాలలోని నిష్ణాతులు తరగతులు నిర్వహిస్తారు. శిక్షణా కార్యక్రమం తర్వాత అభ్యర్థులు అగ్రిక్లినిక్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్ స్థాపించడానికి కావలసిన సహాయ సహకారాలు సి.ఇ.డి అందిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 6వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ సంస్థ తెలిపింది. 9912564767, 9394075379, 9390409897 ఈ ఫోన్ నెంబర్ల ద్వారా మరిన్ని వివరాల కోసం సంప్రదించాలని కూడా తెలిపింది.
News Posted: 1 October, 2009
|