బాపూజీకి ప్రముఖుల నివాళి
హైదరాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీ140వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రోశయ్య, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బాపూఘాట్ దర్శించి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సీఎం రోశయ్యతోపాటు స్పీకర్ కిరణ్ కుమార్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, నన్నపనేని రాజకుమారిలు మహాత్మునికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్ముడు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అసెంబ్లీ ఆవరణలోనూ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కూడా గాంధీజీకి నివాళులు అర్పించారు.
News Posted: 2 October, 2009
|