వరద జిల్లాల్లో హెల్త్ క్యాంపులు హైదరాబాద్ : కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక వైద్య బృందాలను పంపనున్నట్ల ఆయన తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు వైద్య, ఆరోగ్యశాఖ తరుఫున 20 లుక్షల రూపాయల విలువైన మందులను అందజేస్తున్నట్లు ప్రకటించారు.
News Posted: 5 October, 2009
|