బాధితులకు హెరిటేజ్ నీళ్ళు హైదరాబాద్ : రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరద బాధితులను ఆదుకునేందుకు హెరిటేజ్ సంస్థ ముందుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు పిలుపు మేరకు స్పందించిన హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు 7 లక్షల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదల కారణంగా తాగు నీటికి తీవ్ర కొరత ఏర్పిడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మహబూబ్ నగర్ జిల్లా మక్తలు, నందివరం, కర్నూలు జిల్లా నంద్యాల, కృష్ణా, గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలలో విజయవాడ, ప్రకాశం బ్యారేజీ ముంపు ప్రాంతాలలో 5 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. రెండు రోజుల్లో మరో రెండు లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ పి రఘురామారావు తెలిపారు.
News Posted: 5 October, 2009
|