రైతులకు చేయూతనిస్తాం:రఘువీరా హైదరాబాద్ : వరద వల్ల రైతులు భారీగా నష్టపోయారని, ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి హామీ ఇచ్చారు. వరదల వల్ల మూడు వందల డెబ్బై అయిదు కోట్ల రూపాయల వ్యవసాయం నష్టం జరిగిందన్నారు. ప్రతి మండలంలోనూ సైంటిస్టులు విధిగా ఉండి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. కరవు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతుల రుణాలు రీ-షెడ్యూల్ చేస్తామని ఆయన అన్నారు. కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా, గుంటూరు, నల్గొండ, శ్రీకాకుళం జిల్లాల్లో రెండులక్షల నలభై ఒక్క వేల హెక్టార్లలో పంట వరద ముంపుకు గురైందన్నారు. ఆహార ధాన్యాల పంట నష్టం ఎనిమిదివందల అరవై కోట్లుగా అంచనా వేయడం జరిగిందిని మంత్రి తెలిపారు. ముప్పైఆరు వేల హెక్టార్లలో అరటి, మినప, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లడంతో నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దెబ్బతిందని ఆయన తెలిపారు. ఖరీఫ్ సాగుకు గాను 135కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
News Posted: 7 October, 2009
|