హైదరాబాద్ : రాష్ట్రంలోని వరద పరిస్థతిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రోశయ్యను భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సచివాలయంలో భేటీ అయ్యారు. గత వారం రోజులుగా పొన్నాల జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన సీఎంతో భేటీ అయ్యారు. కాగా తాను ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగానే కలిసి వరద పరిస్థితులపై ముచ్చటించానని ఆయన తెలిపారు.