హైదరాబాద్ : ఈనెల 28వ తేదీన కల్యాణమస్తు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ విభాగాలూ ఇందుకు సహకరించాలని ఈవో ఐవై ఆర్ కృష్ణారావు అధికారులను కోరారు. 'కల్యాణమస్తు'లో వివాహం చేసుకున్న దంపతులు 60 రోజుల్లోగా కుటుంబ సభ్యులతో స్వామివారిని ఉచిత దర్శనం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక అధికారిని నియమించి కార్యక్రమ ప్రాధాన్యతను ప్రచారం చేయనున్నట్లు కృష్ణారావు తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.