బాలగోపాల్ మృతికి బాబు సంతాపం హైదరాబాద్ : పౌర హక్కుల పరిరక్షణకు మూడు దశాబ్దాల పాటు అవిరళ కృషి చేసిన ప్రముఖ న్యాయవాది డా.కె.బాలగోపాల్ గురువారం రాత్రి ముండెపోటుతో మరణించడం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పీడ జన శ్రేయస్సు కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన తన ఉద్యోగాన్ని సైతం త్రుణప్రాయంగా వదిలివేశారని ఆయన పేర్కొన్నారు. బాలగోపాల్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుతిని తెలియజేశారు.
News Posted: 10 October, 2009
|