హైదరాబాద్ : కంచే చేనుమేసినట్లు రక్షణగా ఉండాల్సిన సెక్యూరిటీ గార్డ్ బ్యాంకులో చోరీకి పాల్పడిన సంఘటన నగరంలోని రాణిగంజ్ ప్రాంతంలోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకులో చోటు చేసుకుంది. రాత్రి డ్యూటీలో ఉండాల్సిన గార్డ్ కనిపించకపోవడంతో అతనే ఈ చోరీకిపాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆచూకీ తెలుసుకుని నిజానిజాలు రాబడతామని వారు తెలిపారు.