20న శేషేంద్ర జయంతి సభ హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు దివంగత గుంటూరు శేషేంద్ర శర్మ జయంతి సభను ఈ నెల 20న హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారుడు సాత్యకి ఒక ప్రకటలో తెలిపారు. చిక్కడపల్లి త్యాగరాయ గానసభ కళా వేదికలో ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే శేషేంద్ర జయంతి సభలో ప్రముఖ కథా రచయిత్రి డాక్టర్ ముక్తేవి భారతి స్మారక ఉపన్యాసం చేస్తారు. ప్రముఖ కవి, విమర్శకుడు ఆచార్య ననుమాస స్వామి ఆత్మీయ అతిథిగా ఈ సభలో పాల్గొంటారు. ప్రముఖ సాహితీమూర్తులు పాల్గొని శేషేంద్రకు నివాళులు అర్పిస్తారని సాత్యకి వెల్లడించారు.
News Posted: 12 October, 2009
|