హైదరాబాద్ : నిజాంపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో విషాధాన్ని నింపింది. మూడేళ్ళ కొడకుతో పాటు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబకలహాల వల్లే వీరు ఆత్మహత్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరుకు చెందిన రామారావు గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే రామారావు ఇటీవలే ఉద్యోగాన్ని కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.