హైదరాబాద్ : జీడిమెట్లలోని ఓ రసాయన కర్మాగారంలో సోమవారం విషవాయువులు వెలువడడంతో ఓ కార్మికుడు మరణించాడు. మరో కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. దీంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నకోడా కెమికల్ ఫ్యాక్టరీలో ఈ విషవాయువులు లీక్ అయ్యాయి.