బాలయ్య అభిమానుల విరాళం
హైదరాబాద్ : వరద బాధితుల కోసం శ్రీకాళహస్తికి చెందిన పూలకొట్లలలో పనిచేసే బాలకృష్ణ అభిమానులు అందించిన చెక్ ను మాజీ శాప్ ఛైర్మన్, ఎన్టీఆర్ వీరాభిమాని పి.ఆర్ మోహన్ జూబ్లిహిల్స్ లోని బాలయ్య స్వగృహంలో కలుసుకుని ఆయన పేర వారు అందించిన 5116 రూపాయలను డిడిని యువరత్న బాలకృష్ణకు అందజేసారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఈ కష్ట కాలంలో రోజు కూలి చేసుకునే అభిమానులు స్పందించిన తీరు అమోఘమని, దీనిని ఆదర్శంగా తీసుకుని తన అభిమానులు, మరియు నందమూరి వంశాభిమానులు విశేషంగా స్పందించాలన్నారు. ఈ సందర్భంగా బాలయ్య శ్రీకాళహస్తి అభిమానులను హృదయపూర్వకంగా అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు డిడిలు పంపడం కాని, లేక అభిమానులే నేరుగా వరద తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాలకు వెళ్ళి బాధితులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
News Posted: 12 October, 2009
|