: హైదరాబాద్ లోని తాళ్ళగడ్డలో ఓ వ్యక్తి మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం వద్ద గోనెసంచిలో కట్టిపడేసిన మృతదేహాన్ని వదిలి వెళ్ళనట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు వారు భావిస్తున్నారు.