నాణ్యతను పాటిస్తున్నాం : జూపల్లి హైదరాబాద్ : వరద బాధితులకు ఉచితంగా పంపిణీ చేయబడుతన్న నిత్యావసర వస్తువుల్లో నాణ్యత పాటించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. నవంబర్, డిసెంబర్ నెలలకు గాను బాధితులకు 20 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, 2 లీటర్ల పామాయిల్, 2 కేజీల కందిపప్పు, 2 కేజీల టీ పౌడర్ అందించనున్నట్లు ఆయన తెలిపారు.
News Posted: 14 October, 2009
|