హైదరాబాద్ : మారుమూల పల్లెల్లో నివసిస్తున్న ప్రజల సౌకర్యార్ధం గ్రామీణ పోస్టాఫీసుల ద్వారా రైల్వే రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సుందరరాజన్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా ఈ పథకాలను తపాలా శాఖ ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. అంతేకాక పల్లె ప్రజలకు మేలు కలిగే విధంగా తపాలా జీవిత బీమా పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు ఆ శాఖ ప్రకటించింది.