హైదరాబాద్ : రాష్ట్రంలో సంభవించిన వరద ముంపుతో నిరాశ్రుయులైన బాధితుల కోసం ప్రముఖ సాప్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సిఎం సహాయ నిధికి భూరి విరాళం ప్రకటించింది. వరద బాధితుల పునరావాసం కోసం వినియోగించాలని కోరుతూ ఆ సంస్థ ప్రతినిధులు 5 కోట్ల రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి రోశయ్యకు అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఐటి సంస్థలతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్ఫోసిస్ ఈ విరాళాన్ని అందజేసింది.