తెలుగు సంస్కుతి అత్యుత్తమం హైదరాబాద్ : ఢిల్లీ అకాడమీ వారు రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన 22వ వార్షికోత్స కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషకు కృషి చేసిన వారిని సత్కరిస్తే రాబోయే తరాల వారికి మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల మక్కువ పెరుగుతుందన్నారు. వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులను ఆయన సత్కరించారు. తెలుగుభాష గొప్పతనం, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో అత్యుత్తమమైనవనీ, అవి ప్రపంచ దేశాలకూ ఆదర్శం కాగలవని ఆయన ఆభిప్రాయపడ్డారు.
News Posted: 19 October, 2009
|