హైదరాబాద్ : ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ముగ్గురు పిల్లలకు ఉచితంగా విద్యాదానం చెయ్యడానికి కార్తీక్ కన్ స్ట్రక్షన్స్ అధినేత సిహెచ్ రవికుమార్ చంద్రబాబుకు 90 వేల రూపాయల చెక్ ను అందజేశారు. నిరుపేదలకు జీవితంలో స్థిరపడేంతవరకు అవసరమైన విద్యను అందిస్తున్న ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో విద్యాజ్యోతి పథకం కింద ముగ్గురు విద్యార్థులకు విద్యాదానం చేయడానికి ముందుకు వచ్చిన రవికుమార్ ను చంద్రబాబు అభినందించారు.