ఎన్టీఆర్ ట్రస్ట్ కు విరాళాలు హైదరాబాద్ : వరద బాధితుల సహాయార్థం భారీగా విరాళాలను దాతలు చంద్రబాబుకు అందజేశారు. బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నాయకత్వాన 5.2 లక్షల రూపాయలను, అలాగే అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతం నుంచి తెలుగు యువత నాయకులు రామకృష్ణ యాదవ్ 1 లక్ష రూపాయలను, దుగ్గిరాల సుబ్బారావు 1 లక్ష రూపాయలను, సిద్ధి పేట రవీంద్రరెడ్డి 1 లక్ష రూపాయలను, ఎపి జెన్ కో డి.ప్రభాకర్ 50 వేల రూపాయలను, ఆర్మూర్ ఎమ్మెల్యే 90 వేల రూపాయలను, 88 క్వింటాళ్ళ బియ్యాన్నీ, యార్లగడ్డ వెంకటేశ్వరరావు 50116 విలువ చేసే బియ్యం, నగదు, వై.శ్రీధర్ రెడ్డి 25 వేల రూపాయలను, మేడ్చల్ నారెడ్డి నందారెడ్డి 16 టన్నుల బియ్యం, కొత్త దుస్తులను కడియాల సుబ్బారావు 10 క్వింటాళ్ళ బియ్యం, 45 బ్లాంకెట్స్ ను అందించారు.
News Posted: 20 October, 2009
|