1నుంచి చేవెళ్ళలో అభయహస్తం హైదరాబాద్ : 'డార్టర్ వైఎస్సార్ అభయహస్తం' పథకాన్ని నవంబర్ 1నుంచి వైఎస్ సెంటిమెంట్ గా భావించే చేవెళ్ళ నుంచే ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించనున్నారు. లబ్దిదారులకు స్వయంగా ఆయనే సర్టిఫికెట్లు పంపిణీ చేస్తారు. అదే రోజు అన్ని జిల్లాల్లో ఇంచార్జ్ మంత్రులు పాలసీ సర్టిఫికెట్లను లబ్దిదారులకు అందజేస్తారు. మండలాల్లో నవంబర్ 1 నుంచి 10 వరకు స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రోశయ్య 'డాక్టర్ వైఎస్సార్ అభయహస్తం' పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
News Posted: 22 October, 2009
|