'కల్యాణమస్తు ముహూర్తం మారదు' హైదరాబాద్ : హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న 'కల్యాణమస్తు' కార్యక్రమానికి వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి తిరుగులేదని, వారు నిర్ణయించిన ముహూర్తానికే కల్యాణమస్తు కార్యక్రమం జరుగుతుందని మంత్రి గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. వేద పండితులు నిర్ణయించిన మూహుర్తంలో ఎటువంటి అపోహలకు తావులేదన్నారు. వరద బాధితుల సహాయార్థం దేవాదాయ శాఖ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చినట్లు గాదె చ్చెప్పారు. మొత్తం 25 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి రోశయ్యకు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News Posted: 22 October, 2009
|