మిశ్రమ ఫలితాలు హైదరాబాద్ : మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 2009 పార్లమెంటు ఎన్నికల ఫలితాలే ప్రతిబింబించాయి. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్నట్లు ఫలితాలు వారికి అనుకూలంగా ఏమీ లేవు. వాస్తవంగా చెప్పాలంటే హర్యానాలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారింది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా ప్రతిపక్షాలు విడివిడిగా ఎన్నికల్లపాల్గొనడం వల్ల ఓట్లు చీలిపోయాయి. మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సఘ్ (ఎం.ఎన్.ఎస్) ప్రతిపక్ష బిజెపి-శివసేన కూటమిని బాగా దెబ్బతీసింది. అంతేకాని కాంగ్రెస్ కు ఓట్లుకాని, సీట్లుకాని పెరిగిన దాఖలాలు ఏమీలేవు. కాకపోతే ప్రస్తుతమున్న ఎన్నికల విధానం వల్ల కాంగ్రెస్ కొంత లబ్ధి పొందింది. బిజెపి మహారాష్ట్రలో తన బలాన్ని నిబెట్టుకోవడంతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. హర్యానాలో ఒంటరిగా పోటీ చేసి తన బలాన్ని ఒక్క స్థానం నుండి నాలుగుకు పెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా స్వతంత్రంగా రెండు స్థానాలు సాధించింది ఎన్నికల ఫలితాలు ఎవరికీ అనుకూలంగా లేవు.
News Posted: 23 October, 2009
|