ఎన్టీఆర్ ట్రస్ట్ కు 25లక్షల విరాళం హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ కు 25 లక్షల రూపాయలు అందాయి. విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సమీకరించిన 4,95,911 రూపాయలు, పిల్లి సత్యనారాయణ మూర్తి కాకినాడ రూరల్ నంచి సేకరించిన 2 లక్షల రూపాయలు చంద్రబాబునాయుడుకి అందజేశారు. వెన్సార్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ 2.5 లక్షల రూపాయలు, డిఎస్ రావు, విజయవాడ చైతన్య విద్యాసంస్థలు 2 లక్షల రూపాయలు, వాసుపల్లి గణేష్ కుమార్, డైరెక్టరేట్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ 1.25 లక్షల రూపాయలు, జికె నాయుడు, ప్రెసిడెంట్ తులసమ్మ బ్రిక్స్ అసోసియేషన్ 1 లక్ష, నర్సీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు 1, 10,300 రూపాయలు, పి సుబ్రమణ్యేస్వరరావు, ఇసిఐఎల్ 1 లక్షల, ఎమ్మెల్యే కొడాలి నాని 1 లక్ష, శ్రీ పరమేశ్వర ిండస్ట్రీస్, అంకిరెడ్డిపల్లి 1 లక్ష, పులపర్తి నారాయణమూర్తి, పి.గన్నవరం నుంచి 75 వేల రూపాయలు, ఎస్వీ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో 57,900 విరాళాలు చంద్రబాబుకి అందజేశారు.
News Posted: 24 October, 2009
|