హైదరాబాద్ : నగరంలోని బేగంపేట మినిస్టర్ రోడ్‌లోని ఓ రబ్బర్ గోదాంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంకటేశ్వర ఎంటర్ ప్రైజెస్ రబ్బర్ గోదాంలో సెల్లార్లో ఉంచిన రబ్బర్ నిల్వలు తగలబడడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్థినష్టం జరిగినట్లు సమాచారం.