కళ్యామస్తును సక్సెస్ చేయండి:రోశయ్య హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమస్తు పేరిట బుధవారం నిర్వహించే అయిదో దశ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులతో పాటు, ప్రజలు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి రోశయ్య పిలుపునిచ్చారు. సామూహిక ఉచిత వివాహాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారని అన్నారు. గతం కన్నా ఈ సంవత్సరం కళ్యాణమస్తు కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని ఆశిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
News Posted: 27 October, 2009
|