'జననేత' పుస్తకావిష్కరణ హైదరాబాద్ : దిగంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై రచించిన 'జననేత' పుస్తకాన్ని బేగంపేటలోని సీఎం అధికారిక నివాసంలో వైఎస్ తనయుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్ ఎల్వీకే ఈ పుస్తకాన్ని రచించారు. వైఎస్ జీవిత చరిత్రతో పలువురు ప్రముఖుల అభిప్రాయలు, సంతాప సందేశాలను ఆయన ఈ పుస్తకంలో పొందుపరిచారు. రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారికి ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నట్లు ఎల్వీకే తెలిపారు.
News Posted: 28 October, 2009
|