మరో వివాదంలో రాజశేఖర్? హైద్రాబాద్ : హీరో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల ఇంట్లో ఆయన కారు డ్రైవర్ శ్రీనివాస్ బుధవారంనాడు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన సంచలనం సృష్టించింది. మృతుని బంధువులు రాజశేఖర్ ఇంటి ముందు ఆందోళన చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే మీడియా సిబ్బంది హైద్రాబాద్ లోని రాజశేఖర్ నివాసానికి చేరుకున్నప్పటికీ సరైన వివరాలు సేకరించ లేకపోయారు.
ఈ సంఘటనపై మీడియా సిబ్బంది ప్రశ్నించినప్పుడు రాజశేఖర్ దంపతులు రుసరుసలాడారు. 'నో కామెంట్' అని రాజశేఖర్ చెప్పడంతో పాటు వారితో వాగ్యుద్దానికి దిగారు. శ్రీనివాస్ గత రెండు రోజులుగా జ్వరంతో బాధపుడుతున్నప్పటికీ పట్టించుకోలేదనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News Posted: 28 October, 2009
|