హైదరాబాద్ : నగరంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఉప్పల్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొనడంతో మంటలు రేగాయి. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న కామేష్ అనే వ్యక్తి అక్కడిక్కడే సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.