'ప్రత్యామ్నాయం లోక్ సత్తాయే' హైదరాబాద్ : ప్రత్యామ్నాయ రాజకీయానికి అసలైన వేదిక లోక్ సత్తాయే అని రాష్ట్ర ప్రజలు గుర్తించారని, గ్రేటర్ ఎన్నికల్లో మన సత్తా చాటిచెప్పి, ఆ గుర్తింపును సుస్థిరం చేసుకుందామని ఆ పార్టీ శ్రేణులకు అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. లోక్ సత్తా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల వ్యూహ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పరిధి విస్తరిస్తున్న కొద్దీ నేతలు, శ్రేణులు మరింత సమతుల్యతతో, హుందాగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయం కోరుతున్నవారు పార్టీలోకి వచ్చి సంప్రదాయ రాజకీయాలను మార్చే కృషిలో భాగస్వాములయ్యే వారందరినీ కలుపుకొని ముందుకు సాగాలన్నారు.
News Posted: 2 November, 2009
|