గాంధీభవన్ పై రాళ్ళ దాడి హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా టికెట్ల పంపిణీలో చెలరేగిన అసంతృప్తికి నిరసనగా శుక్రవారం గాంధీభవన్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కొందరు అసంతృప్తి నేతలు దానం, డీఎస్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్ల దాడికి పాల్పడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యకర్తలు గాంధీభవన్ ముందు బైటాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది.
News Posted: 6 November, 2009
|