న్యాయం జరగలేదు మణెమ్మ హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ ఎమ్మెల్యే మణెమ్మ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం కార్యకర్తలకు న్యాయం జరగలేదని, వచ్చే ఎన్నికల్లో నేను ఆ నియోజకవర్గాల్లో ఓట్లు వేయమని ఎలా అడగ్గలను? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయాన్ని దానం నాగేందర్ దృష్టికి తీసుకువెళ్ళానని, ఆయన తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు మణెమ్మ పేర్కొన్నారు.
News Posted: 6 November, 2009
|