11నుండి చిదాత్మానంద ప్రవచనాలు హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో స్వామి చిదాత్మానంద ప్రవచనాలు నవంబరు 11 నుంచి 15వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు సీఈవో రఘురామారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. బంజారాహిల్స్, రోడ్ నెం.2, కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు కార్యాలయంలో సాయంత్రం 6-30 గంటల నుండి 8-00 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజయసాధనకు కావలసిన గోప్యమైన మహాశక్తుల గురించి స్వామీజీ ప్రవచిస్తారు. విజయమును ఆకాంక్షించే, సఫలత్వమును అభిలషించే వారంతా హాజరై విజయసాఫల్యం పొందాలని ఆయన కోరారు.
News Posted: 9 November, 2009
|