6గురు ఐపీఎస్ లకు స్థానచలనం హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం బదిలీ చేసిన ఐపీఎస్ అధికారుల వివరాల్లోకి వెళితే ఇంటిలిజెన్స్ డీఐజీగా ఎన్ సుబ్రహ్మణ్యం, మెరైన్ పోలీస్ డిఐజీగా ఎన్ చంద్రమౌళి, ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా శ్రీనివాసరెడ్డి, ఏపీఎస్పీ స్పెషల్ బెటాలియన్ కు సీతారామాంజనేయులు, కరీంనగర్ రేంజ్ డీఐజీగా కె రవిశంకర్, ఏలూరు రేంజ్ డీఐజీగా మహేష్ భగవాన్ నియామకం అయ్యారు.
News Posted: 10 November, 2009
|