హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. పలు పార్టీలకు రెబల్స్ బెడద తప్పేట్టు లేదు. అధినాయకత్వం బుజ్జగింపులు ఎక్కడా పనిచేయలేదు. పార్టీ విజయావకాశాలపై తిరుగుబాటు అభ్యర్థుల ప్రభావం ఉంటుందని అగ్రనేతలు ఆందోళన చెందుతున్నారు.