హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్ల వివరాలు రేపటి నుంచి జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఎన్నికల ప్రత్యేక అధికారి కృష్ణబాబు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోటో గుర్తింపు కార్డులు పోస్టుద్వారా పంపిస్తామని అన్నారు. అయితే కార్డు అందనివారు ఈ-సేవా కేంద్రాల్లో పొందవచ్చని ఆయన సూచించారు. ఓటర్ల సహాయార్ధం రేపటి నుంచి టోల్‌ఫ్రీ నెంబరు 15503 ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 33 మంది సీనియర్ అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ఓటర్ల జాబితాను గురువారం అన్ని పార్టీలకు అందజేస్తామని కృష్ణబాబు పేర్కొన్నారు.