హైదరాబాద్ : సికింద్రాబాద్ - జహీరాబాద్ ఫ్యాసింజరు రైల్లో బుధవారం మంటలు వ్యాపించాయి. ఇంజన్ నుంచి మంటలు రావటంతో వెంటనే గమనించిన రైల్వే సిబ్బంది మూసాపేట సమీపంలో రైలును నిపిలివేసి మంటలను అదుపు చేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించిన తర్వాత రైలుకు సిగ్నల్ ఇచ్చారు.