'సాధనే విజయ రహస్యం' హైదరాబాద్ : ప్రతిభతో ప్రయత్నించి చిత్తశుద్దితో సాధించడమే విజయ రహస్యమని స్వామి చిదాత్మానంద పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో 'విజయ సాధనలో అంతర్గత శక్తులు' అంశంపై జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వామీజీ ప్రసంగించారు. ఆలోచన, నమ్మకం, విశ్వాసాలతో, చిత్తశుద్ధితో కృషిచేస్తే సమర్థత వెలికి వస్తుందన్నారు. స్వామి చిదాత్మానంద రచించిన 'మానవ సంబంధాలలో సమస్యలు-ఆధ్యాత్మిక పరిష్కారాలు' అను గ్రంథాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆథ్యాత్మిక, పరిజ్ఞానం, సనాతన సాంప్రదాయాలలో భారతదేశం ప్రపంచానికే తలమానికం వంటిదని తెపేర్కొన్నారు. భారత కుటుంబ వ్యవస్థ ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా పేర్కొంటూ డబ్బు సబబు కాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు యోగా శిక్షణ, ప్రకృతి వైద్యంపై గతంలో శిక్షణా తరగతులు నిర్వహించిన విషయం గుర్తు చేశారు. ఐదు రోజుల పాటు జరిగే స్వామీజీ ప్రవచనాలను విని వ్యక్తిత్వం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. శ్రీమతి నారా భునేశ్వరి జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
News Posted: 12 November, 2009
|