హైదరాబాద్ : దోపిడీ దొంగలు సోమవారం ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు దోచుకున్నారు. ఈ ఘటన ఎల్ బీనగర్ లో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించడంతో స్థానికుల్లో కలవరం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.