సీపీఎం కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ, రాష్ట్ర కమిటీ సమావేశాలు నగరంలోని ఎంబీ భవన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్, పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారం ఏచూరి హాజరయ్యారు. ఇందులో మొదటి రెండు రోజులు సెక్రటేరియట్, చివరి రెండు రోజులు రాష్ట్ర కమిటీ సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాక జాతీయ, రాష్టస్థ్రాయిలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలిసింది.
News Posted: 16 November, 2009
|