ఓటర్ల కోసం ఎస్సెమ్మస్ సర్వీస్ హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించునేందుకు కావల్సిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునే వీలును జీహెచ్ఎంసీ సంస్థ కల్పిస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కుకుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు జీహెచ్ సంస్థ ఎస్ఎంఎస్ స్వరీస్ ను ప్రారంభించింది. ఓటర్లు తమ ఓటు హక్కు ఏ ప్రాంతంలో ఉంది, ఎక్కడ ఓటు వేయాలో తదితర విషయాలను మొబైల్ లో జిహెచ్ ఎంసీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ టైప్ చేసి 56677 నవంబర్ కు ఎస్ఎంఎస్ చేసి తెలుసుకోవచ్చని గ్రేటర్ ఎన్నికల కమిషన్ ఎస్పీ సింగ్ అన్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలను స్పెషల్ కమిషనర్ కృష్ణబాబు వివరించారు.
News Posted: 16 November, 2009
|