హైదరాబాద్ : సంతోష్‌నగర్‌లోని ఓ ఆయుర్వేదిక్ ఔషదాల కంపెనీ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే అక్రమంగా గోడౌన్‌లో ఆయిల్ తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గోడౌన్ లో భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమం అందించారు. దీంతో ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.