అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి 29 లారీలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా అధిక లోడుతో వెళుతున్న వాహనాలను మంగళవారం అధికారులు సీజ్ చేశారు. కేసులు నమోదు చేసి 7 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.