హైదరాబాద్ : ఇంజినీరింగ్ చదువుతున్నవిద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో హయత్‌నగర్ నోవా కళాశాల లో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రేమ్ కుమార్‌కు కళాశాల యాజమాన్యం హాల్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో మనస్థాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రేమ్‌కుమార్ మృతికి యాజమాన్యమే కారణమని తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు.