హైదరాబాద్ : మాజీ ప్రధానమంద్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రోశయ్య ఆమెకు నివాళి అర్పించారు. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశాభివృద్ధి కోసం చేసిన కృషి మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు.