హైదరాబాద్ : కిడ్నాప్‌కు గురైన రియల్టర్ అశోక్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. మహబూబ్‌నగర్ శివారు ప్రాంతంలో ఆయన మృతదేహం లభ్యమయింది. నగరంలోని కుషాయి గూడలో మంగళవారం గుర్తుతెలియని దుండగులు ఆయనను కిడ్నాప్ చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో మహబూబ్ నగర్ శివారు ప్రాంతంలో బుధవారం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే పోలీసులు ఆయన బంధువులకు సమాచారం అందించారు.