హైదరాబాద్ : అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ శరత్ బాబు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. యూసఫ్ గూడలోని ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడంతో కోటి రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు వారు గుర్తించామన్నారు.