హైదరాబాద్ : ఇంగ్లీషు మీడియం సక్సెస్ స్కూళ్ళలో స్టేట్ సిలబస్ నే కొనసాగించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సూచించారు. సక్సెస్ స్కూళ్ళలో సీబీఎస్ఈ సిలబస్ కొనసాగించాలా? స్టేట్ సిలబస్ ను ప్రవేశ పెట్టాలా? అనే అంశంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో విద్యాశాఖ ఈ రోజు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీబీఎస్ ఈ సిలబస్ వల్ల విద్యార్థులకు లాభాల కంటే నష్టమే ఎక్కువని వారు పేర్కొన్నారు.