హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు ద్విచక్రవాహనదారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని అంబర్‌పేట ఖాజీబాగ్ వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి నాలుగు బైకులపై దూసుకెళ్లడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్ధానికులు బస్సు అద్దాలను పగలగొట్టి ఆందోళనకు దిగారు. దీంతో ఘటనాస్థలి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.