హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులపై లాఠీఛార్జ్ కు కారణమైన పోలీసు ఉన్నతాధికారి స్టీఫెన్ రవీంద్రను విధుల నుంచి తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. శాంతియుతంగా కేసీఆర్ దీక్ష చేపడితే ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని ఆయన అన్నారు. విద్యార్థులు ఆయనకు మద్దతుగా ధర్నాలు చేపడితే వారిపై లాఠీఛార్జీ చేయడం దారుణమన్నారు. తెలంగాణ బంద్ సందర్బంగా సిద్ధిపేటలో ఆయన సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపులను వెంటనే ఎత్తివేయాలన్నారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు.